అల వైకుంఠపురంలో..త్రివిక్రమ్‌ అదిరే ట్విస్ట్..!

536
trivikram vishnu
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురంలో. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచిరెస్పాన్స్‌ రాగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్‌. కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుండగా రెండు పాత్రల్లో కడుపుబ్బా నవ్విస్తాడట బన్నీ. త్రివిక్రమ్‌ ఇచ్చే ఈ అదిరే ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేయనుందట.

గతంలో బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి , సన్ ఆఫ్ సత్యమూర్తి మంచి విజయాలు అందుకోగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కాంబినేషన్‌లో అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

Allu Arjun To Play Dual Role In Ala Vaikuntapuramlo Movie. #AlaVaikunthapuramulo is an upcoming film featuring Allu Arjun and Pooja Hegde in lead roles. Music Composed by Thaman S. Directed by Trivikram Srinivas & Produced by Allu Aravind & S Radha Krishna(chinababu).

- Advertisement -