బాబు పై పూనమ్ కౌర్ ఇలా, మురళీమోహన్ అలా!

34
- Advertisement -

చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై టాలీవుడ్ ప్రముఖులు సైలెంట్ గా ఉన్నారంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా ముగ్గురు సినీ ప్రముఖులు బాబు జైలు జీవితం షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతుండం పట్ల నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ స్పందించారు. జైళ్లలో కూడా హత్యలు జరిగిన ఘటనలు ఉన్నాయి, జైల్లో చంపేయడం పెద్ద విషయం కాదు. ఆయనకేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మురళీమోహన్ స్పష్టం చేశారు. తాను గతంలో రాజమండ్రి ఎంపీగా పని చేశానని, సెంట్రల్ జైలు గురించి తనకు పైగా తెలుసని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. నిజంగా జైల్లో చంపేయడం పెద్ద విషయం కాదు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

అలాగే, చంద్రబాబు అరెస్ట్‌ పై హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా రియాక్ట్ అయ్యింది. ‘ప్రస్తుతం ఆయనకు 73 ఏళ్లు అంటే జైలు లో ఉండాల్సిన వయసు కాదు. ఈ అంశంపై మాట్లాడడానికి నాకు ఎలాంటి అధికారం, సంబంధం లేదు. కానీ, మానవత్వంతో స్పందిస్తున్నాను. ఆయన ప్రజా జీవితానికి ఎంతో సమయం కేటాయించారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని సంబంధిత వ్యక్తులను నేను వేడుకుంటున్నాను’ అంటూ పూనమ్ కౌర్ తన Xలో పోస్ట్ చేసింది.

Also Read:రవితేజతో ఫిక్స్.. ఆశ్చ‌ర్య‌పోనక్కర్లేదు

అదే విధంగా చంద్రబాబు అరెస్టుపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరోసారి స్పందించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారు. ఇప్పుడు కూడా ఆ స్వామి వారే చంద్రబాబును కాపాడతారు. వెంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులతో చంద్రబాబు ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా జైలు నుంచి తప్పకుండా బయటపడతారని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు.

Also Read:ప్చ్.. కాజోల్ కూతురితో ఎన్టీఆర్ అట

- Advertisement -