మునుగోడు మొనగాడు కూసుకుంట్ల..

263
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి తన ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ దగ్గరి నుండి ప్రతి రౌండ్‌లో స్పష్టమైన ఆధిక్యత కనబర్చారు కూసుకుంట్ల. దీంతో మునుగోడు ప్రజల మనసు గెలిచి మునుగోడు మొనగాడుగా నిలిచారు.

ఉపఎన్నికలు ఈనెల 3న జరగగా, రికార్డు స్థాయిలో 93.13శాతం పోలింగ్‌ నమోదైంది. 2,41,805 ఓట్లకుగాను మొత్తం 2,25,192 ఓట్లు పోలయ్యాయి. కూసుకుంట్లకు 96,584 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌కు 86,545 ఓట్లు, కాంగ్రెస్‌కు 23,887 ఓట్లు వచ్చాయి.

కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రొఫైల్..
S/౦.జంగారెడ్డి….
సతీమణి.. అరుణ..
కుమారుడు.. కుసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి..కోడలు. స్రవంతి,,….
కూతురు రమ్య…అల్లుడు శ్యాం సుందర్ రెడ్డి..
గ్రామం….లింగవారి గుడం…
మండలం.. నారాయణ పురం.. యాదాద్రి జిల్లా..

విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకoగా పని చేసి,,,కేసీఆర్ గారి పిలుపునందుకొని ఉద్యమం లోకి వచ్చారు. 2003 నుంచి TRS లో క్రియాశీలక పాత్ర. …..మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి గా పనిచేశారు. 2009 ఎన్నికల్లో మునుగోడు నుంచి టీఆర్ఎస్ నుండి పోటీచేసి ఓడిపోయారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. తిరిగి తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి..

పత్తా లేని చెయ్యి…

ప్రజలంతా కేసీఆర్‌ వెంటే:హరీశ్‌

నల్గొండ…గులాబీ కంచుకోట

- Advertisement -