ఎగ్జిట్‌పోల్‌ సర్వేల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

275
- Advertisement -

గత నెలరోజులుగా ఉత్కంఠగా కొనసాగిన మునుగోడు నియోజకవర్గ ఎన్నికల్లో ప్రధానంగా టీఆర్‌ఎస్‌ బీజేపీల మధ్య జోరుగా ప్రచారం కొనసాగింది. నవంబర్‌3న మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు తమ తమ నివేదికలను వెల్లడించాయి. ఎన్నికల సరళిపై పలు సర్వేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ… గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పటి నుంచే అంచనాలు పెంచేలా సర్వే రిపోర్టులు బహిర్గతం చేశాయి.

థర్డ్‌ విజన్‌ రీసెర్చ్‌- నాగన్న ఎగ్జిట్‌పోల్స్‌ సర్వే ప్రకారం..

టీఆర్‌ఎస్‌- 48-51 శాతం
బీజేపీ- 31-35 శాతం
కాంగ్రెస్‌- 13-15 శాతం
బీఎస్పీ- 5-7 శాతం
ఇతరులు- 2-5 శాతం.

ఎస్‌ఏఎస్‌ గ్రూప్‌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే ప్రకారం..

టీఆర్‌ఎస్‌- 41-42 శాతం
బీజేపీ- 35-36 శాతం
కాంగ్రెస్‌- 16.5-17.5 శాతం
బీఎస్పీ- 4-5 శాతం
ఇతరులు- 1.5-2 శాతం.

నేషనల్‌ ఫ్యామిలీ ఒపీనియన్‌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే ప్రకారం..

టీఆర్‌ఎస్‌- 42.11 శాతం
బీజేపీ- 35.17 శాతం
కాంగ్రెస్‌- 14.07 శాతం
బీఎస్పీ- 2.95 శాతం
ఇతరులు- 5.70 శాతం.

ఇవి కూడా చదవండి..

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

టీఆర్ఎస్‌ కార్యకర్తలకు ధన్యవాదాలు:కేటీఆర్

గ్రేటర్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు..

- Advertisement -