మునుగోడు ఉప ఎన్నికలేమో కానీ బీజేపీ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. 3 సంవత్సరాల క్రితమే బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుని సరిగ్గా ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి పువ్వు పార్టీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలకు కారణమైన రాజగోపాల్ రెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా కోమటిరెడ్డికి పరాభవం తప్పడం లేదు. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా తాజాగా నిర్వహించిన సర్వేలో బండి సంజయ్ బ్యాచ్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ పార్టీ నిర్వహించిన సర్వేలో కాషాయ పార్టీ మూడో స్ధానానికే పరిమితం కాగా దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర అసహనం వ్యక్తం చేశారట.
సర్వేలో మూడో స్ధానం రావడంతో తెలంగాణ బీజేపీ నేతలు ముఖ్యంగా బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారట. నేతల మధ్య సమన్వం లేదని ఇందుకేనా 22 వేల కోట్ల కాంట్రాక్ట్‌లు ఇచ్చిందని రాజగోపాల్‌పై సైతం మండిపడ్డారని సమాచారం. ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేది ఓడిపోయేందుకేనా అంటూ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఎన్నికల తర్వాత వచ్చిన మైలేజ్….మునుగోడు ఉప ఎన్నికతో పోతోందని అనవసరంగా ఉప ఎన్నిక తీసుకొచ్చామంటూ నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారని సమాచారం.