- Advertisement -
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పూర్తయిన తర్వాత ఈవీఎంల ద్వారా ఓట్లను లెక్కించనున్నారు.
మొత్తం 15రౌండ్‌లో కౌంటింగ్ ప్రక్రియ జరగనుండగా ఈ 15 రౌండ్లలో 298 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లన్నింటినీ లెక్కించనున్నారు. మొదటగా చౌటుప్పల్ మండలం ఓట్లను ఆ తర్వాత సంస్థాన్‌నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లను లెక్కించనున్నారు. ఇందులో ఒక్కో రౌండ్‌లో 21పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 21టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితం వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
వందేమాతరం,జనగణమన రెండు సమానమే:కేంద్రం
నకిలీ బాస్మతి రకాలను గుర్తించడం ఎలా…
భారతీయులు గొప్పోళ్లు..పుతిన్ ప్రశంస
- Advertisement -