కొత్త మేయర్లతో ఆర్ధిక సంఘం చైర్మన్ భేటీ..

224
G Rajesham Goud
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుక్కోబడిన మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ల సమావేశం బుధవారం హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక సంఘం చైర్మెన్ జి.రాజేశం గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి యం.చెన్నయ్య తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక సంఘం మెంబెర్ హాజరైయ్యారు. ఆయన సభను ఉదేశించి వారి అనుభవాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జి.రాజేశం గౌడ్ మాట్లాడుతూ.. వారు గతంలో జిల్లా పరిషత్తు అధ్యక్షులుగా అలాగే రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవాలను వారికి తెలియ జేసినారు. మన రాష్ట్ర ముఖ్య మంత్రి స్థానిక సంస్థలను పురపాలక సంఘాలను బలోపేతం చెయ్యడానికి ఎంతగానో కృషి చేసి కొత్త చట్టాలను తేవడం జరిగిందని.. వీటి కారణంగా సామాన్య మానవునికి కూడా ఎంతో లాభం కలుగుతుందని తెలిపారు. దానిలో భాగంగానే జిల్లాలను, మండలాలను, గ్రామాలను, పురపాలికలను పునర్విభజించటం జరిగిందని ఆయన గుర్తు చేశారు. వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా ప్రజలకు సామాన్య మానవుడికి సైతం ఎంతగానో సేవలందించాలని ప్రజా ప్రతినిధులను కోరారు.

ప్రతి మున్సిపాలిటి కర్పొరేషన్ పరిధిలోని ప్రజల్లో స్వయం సహయ స్పూర్తిని, చొరవను పెంపొందించుటకు, జీవన ప్రమాణమును పెంచుటకు, వారి ఉత్సాహమును ఉపయొగించుటకు ప్రయత్నించాలని తెలిపారు. ఈ సమావేశములో మేయర్లు చాల చురుకుగా పాల్గొని వారి వారి సూచనలు తెలియజేశారు.వారి వారి పురపలిక కార్పొరేషన్లలో ప్రజలకు సేవలందించేందుకు గాను తగిన రీతిలో ఆర్థిక సహాయం అందజేయుటకు తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.జి.రాజేశం గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక సంఘం చైర్మెన్ వారి కోరికలను సావదానంగా పరిశీలించడానికి వీటిని ప్రభుత్వ దృష్టికి తెసుకు వెళ్లనున్నట్లు తెలిపినారు.

- Advertisement -