- Advertisement -
అసెంబ్లీలో కొత్త పురపాలక చట్టం 2019 బిల్లును ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. ముందుగా మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పలు బిల్లులు, ఆర్డినెన్స్ లను ప్రవేశపెట్టారు. బోధనా వైద్యుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచుతూ చేసిన ఆర్డినెన్స్ సభలో ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఎక్సైజ్, సర్వ శిక్షా అభియాన్ వార్షిక ఆడిట్ రిపోర్ట్ ను సభ ముందుంచారు. ఇవాళ సాయంత్రం వరకు 4 గంటల వరకు బిల్లుపై సవరణలు స్వీకరించనుంది ప్రభుత్వం. ఈ బిల్లుపై రేపు శాసనసభలో చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. చర్చకు ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు.
- Advertisement -