27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక

271
ts election

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 25న వెలువడనున్న సంగతి తెలిసిందే. 9 కార్పొరేషన్లు,120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగగా మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది.

ఈ నెల 27న కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరగనుంది. తొలుత సభ్యుల ప్రమాణస్వీకారం జరగనుండగా మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. అనంతరం డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు.

ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో సగటున 70.26 శాతం ఓట్లు పోలయ్యాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.