మెక్‌గ్రాత్‌తో కేటీఆర్..

288
mcgrath

క్రికెట్ లెజెండ్,ఆసీస్ పేస్ బౌలర్‌ మెక్‌గ్రాత్‌తో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్. స్విట్జర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో భాగంగా హెచ్‌సీఎల్ రిసెప్షన్ వద్ద మెక్‌గ్రాత్‌ని కలిశారు.

మెక్‌గ్రాత్‌ను చూసి కేటీఆర్ సంబ‌ర‌మాశ్చ‌ర్యానికి గురైన కేటీఆర్ …మెక్‌తో కాసేపు ముచ్చటించారు. ఆఫ్ స్టంప్‌పై మెషీన్‌లా బంతులు వేసే మెక్‌గ్రాత్‌ అంటే తనకు ఇష్టమన్నారు. త‌న మాట‌లు విని.. గ్లెన్ త‌న‌ను ఎంతో ఆప్యాయంగా భుజం త‌ట్టిన‌ట్లు మంత్రి కేటీఆర్ ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

క్రికెట్ లెజెండ్‌తో హెచ్‌సీఎల్ సీఈవో సీ విజ‌య్‌కుమార్ షో నిర్వ‌హించారు. ఈ సందర్భంగా త‌న కెరీర్ నుంచి ఎన్నో నాయ‌క‌త్వ పాఠాల‌ను గ్లెన్ త‌న షోలో వినిపించారు.

మెక్‌గ్రాత్ బౌలింగ్‌ వేశాడంటే.. బ్యాట్స్‌మెన్ ఎవరికైనా వ‌ణుకు పుట్టాల్సిందే. హేమాహేమీ బ్యాట్స్‌మెన్లు కూడా మెక్‌గ్రాత్ బౌలింగ్‌ను ఎదుర్కోవ‌డంలో ఇబ్బందిప‌డేవారు. ఆస్ట్రేలియా మూడుసార్లు ప్రపంచకప్‌ విజేతగా నిలవడంలో ప్రధానపాత్ర పోషించాడు గ్లెన్ మెక్ గ్రాత్. తన కెరీర్‌లో మొత్తం 4 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొని 39 మ్యాచ్ ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు సాధించి ఆల్ టైమ్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు గ్లెన్.