దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా. రామ్ పోతినేనితో కలిసి నటించిన ఈ అమ్మాయి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పోకిరి, జులాయి, కిక్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. కానీ అనతి కాలంలోనే ఐరన్‌లెగ్ మారి…ముంబాయికి మకాం మార్చింది. ముంబాయిలో కూడా అంతగా అకట్టుకోలేకపోయిన గోవా బ్యూటీ..రుస్తోంతో మంచి పేరు తెచ్చుకున్న సినిమాలు మాత్రం రాలేకపోయాయి. అయితే ఇదంతా గతం అనుకుంటే ప్రస్తుతం ఈ గోవా బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో దర్శనమిస్తూ యవతలో హీట్‌ను అమాంతం పెంచుతూ ఉంటుంది.
Also read: ఏప్రిల్ 20…రామబాణం ట్రైలర్ ఎట్ రాజమండ్రి
కాగా తాజాగా ఈ బ్యూటీ చేసిన ఒక పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎంటంటే.. త్వరలోనే తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో చెప్పింది. తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాలో తెలిపింది. ‘త్వరలో నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నాను.. నా చిట్టి డార్లింగ్’ అంటూ రెండు ఫోటోలను షేర్ చేసింది. అందులో మొదటి దాంట్లో ‘అడ్వేంచర్ మొదలవబోతుంది’ అని రాసి ఉన్న టీ షర్టును పోస్ట్ చేసింది. రెండో దాంట్లో మామా(అమ్మ) అనే లాకేట్ ఉంది. ఇలా రెండు ఫోటోలను షేర్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ అని క్లారిటీ ఇచ్చేసింది. పెళ్లి కాకుండా తల్లి ఏలా అయ్యావు అంటూ పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Also read: అఖిల్ కి ” ఏజెంట్ ” అగ్ని పరీక్షే !
ఈ గోవా బ్యూటీ ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో కొంతకాలం డేటింగ్ చేసింది. కానీ ఇది చివరి వరకు ఉంటుందని చెప్పకనే బ్రేకప్ చేప్పేసింది. అయితే కత్రినా కైఫ్ సోదరుడు స్టెబాస్టిన్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు గతంలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే దాన్ని నిజం చేస్తూ ఎన్నో సార్లు ఈ జంట మీడియా కంటపడింది. మరీ ఆ బిడ్డకు తండ్రి ఎవరనేది కాలం నిర్ణయిస్తుంది..ప్రస్తుతం ఇలియానా అన్ఫేర్ అండ్ లవ్‌లీ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరీ ఆలోపు తండ్రీ ఎవరనేది ఇలియానా ప్రకటిస్తుందో? లేదో? వేచి చూడాలి..!