ఐపీఎల్ 2023లో భాగంగా ప్లే ఆఫ్స్‌కు చేరింది ముంబై. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించడంతో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరింది. బెంగళూరు నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించడంతో నాలుగో జట్టుగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
Also Read:బ్యాంక్ అకౌంట్ లేకపోయినా రూ.2వేలు మార్చుకోవచ్చు
శుభ్‌మన్ గిల్ (104నాటౌట్; 52 బంతుల్లో5 ఫోర్లు 8 సిక్సర్లు) సెంచరితో విధ్వంసం సృష్టించగా, విజయ్ శంకర్(53 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(101 నాటౌట్; 61 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు.
ఇక తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడిన ముంబై భారీ విజయాన్ని నమోదుచేసింది.
Also Read:KTR: రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ