టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

29
Mumbai Indians

ఐపీఎల్ 2020 టోర్నీలో 51వ మ్యాచ్ జరుగుతోంది.. దుబాయ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ముంబై తాత్కాలిక కెప్టెన్‌ పొలార్డ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. గాయం కారణంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు 25 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ముంబై జట్టు 13 సార్లు గెలవగా… ఢిల్లీ టీమ్ 12 సార్లు విజయం సాధించింది. ఐపీఎల్ 2020 టోర్నీలో ఇంతకు ముందు కూడా ఇరుజట్లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 11న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ముంబై ఇప్పటికే ప్లేఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకోగా ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్‌-4కు అర్హత సాధించాలని ఢిల్లీ పట్టుదలతో ఉంది. ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో ముంబై 16 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని ఢిల్లీ ఆడిన 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.