ఐపీఎల్… ఐదోసారి విజేతగా ముంబై

118
rohith

ఐపీఎల్ 2020 విజేతగా నిలిచింది ముంబై. ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఐదోసారి ఐపీఎల్ కప్‌ గెలుపొందింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి విజయం సాధించింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 157 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి ముంబైకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. డికాక్ 20 ,సూర్యకుమార్ యాదవ్ 19 పరుగులు చేసి ఔటైనా మరోవైపు రోహిత్ మాత్రం స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రోహిత్ 50 బంతుల్లో 5 సిక్స్‌లు,5 ఫోర్లతో 68 పరుగులు చేయగా పొలార్డ్ 9, ఇషాన్ కిషన్ 33 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు.

అంతకముందు టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే ఢిల్లీకి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 22 రన్స్‌కే 3 వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది .ఈ దశలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్(65 నాటౌట్), రిషబ్‌ పంత్‌(56: 38 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 20 ఓవర్లలో ఢిల్లీ 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. ట్రెంట్‌ బౌల్ట్‌(3/30),కల్టర్‌ నైల్‌(2/29), జయంత్‌ యాదవ్‌(1/25) వికెట్లు తీశారు.