ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్ ముగిసింది. ఓపెనర్లు ఇద్దరు స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరడంతో యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్(40), సుర్యకుమార్(43) అద్భుమైన 78 పరుగుల భాగస్వామ్యంతో ముంబై భారీ స్కోర్ సాధించింది. మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది.
దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి ముంబై ఓపనర్ ఎవిన్ లివీస్ ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవియలన్ బాట పట్టాడు. ఆ తర్వాత వాట్సన్ వేసిన నాలుగో ఓవర్లో ఈ సీజన్‌కి తొలి సిక్సర్‌ను బాదిన రోహిత్ అదే ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో ఇషాన్, సూర్యకుమార్ జట్టుకు అండగా నిలిచారు. అయితే వాట్సన్ వేసిన 13వ ఓవర్లో సూర్యకుమార్ క్యాచ్ ఔట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. వెంటనే తాహీర్ వేసిన 15వ ఓవర్‌లో ఇషాన్ కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో పాండ్యా సోదరులు జట్టును ఆదుకున్నారు. కృనాల్ (41, 22బంతుల్లో), హార్థిక్ (22, 20 బంతుల్లో) కలిసి ఐదో వికెట్‌కి 52 పరుగల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో 20 ఓవర్లలో ముంబై 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. చెన్నై బౌలింగ్‌లో వాట్సన్ 2, చాహర్, తాహీర్ తలో వికెట్ తీశారు.