కాంగ్రెస్‌ చీఫ్‌గా ముకుల్‌ వాస్నిక్‌..!

542
mukul wasnik
- Advertisement -

కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరా అనే మూడు నెలల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన రాహుల్ అదే మాటకు కట్టుబడి ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వద్దని వారించిన తన రాజీనామాను మాత్రం ఉపసంహరించుకోలేదు.

ఈ నేపథ్యంలోనే తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరనే దానిపై రకరకాల వార్తలు వెలువడుతునే ఉన్నాయి. ప్రియాంక గాంధీ,సచిన్ పైలట్,జ్యోతిరాధిత్య సింధియా పలువురి పేర్లు వినిపించాయి.

కానీ చివరిగా గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన ముకుల్ వాస్నిక్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే ముకుల్‌కే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని సోనియా సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ నాయకుడు బాలకృష్ణ వాస్నిక్‌ కుమారుడు ముకుల్ వాస్నిక్. 25ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికైన ముకుల్….పీవీ, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. సోనియాగాంధీకి కార్యదర్శిగా కొనసాగారు. పాలనా వ్యవహారాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది.ఇవాళ జరిగే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ముకుల్ పేరును ఫైనల్‌ చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -