భారతీయ సంపన్నడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ త్వరలోనే పెళ్లికూతురు కానుంది. ఆమె చాలా కాలంగా ప్రేమలో ఉందని సమాచారం. అయితే పెళ్లికుమారుడు ఎవరనే విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఏదేమైనప్పటికీ, తన ముద్దుల కూతురు ఇష్టప్రకారమే ముఖేష్ అంబానీ వివాహం చేస్తున్నారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వెడ్డింగ్ కు పలువురు రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారని సమాచారం. బాలీవుడ్ బాద్షా ఈ వేడుకలో షారుఖ్ ఖాన్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నాడని సమాచారం.కాగా, దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న రిలయన్స్ జియోకి జీవం పోసినవారిలో ఇషా ఒకరు.
24 ఏళ్లకే వేల కోట్ల వ్యాపారాన్ని హ్యాండిల్ చేస్తున్న ఇషా గురించిన ఆసక్తికరమైన అంశాలు..
-1991లో జన్మించిన ఇషా 2013లో యేల్ యూనివర్సిటిలో సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్‌లో డిగ్రీ సంపాదించారు.
-2014లో న్యూయార్క్‌లోని మెక్‌కిన్సే అండ్ కంపెనీలో బిజినెస్ ఎనాలసిస్ట్‌గా చేరారు.
-అదే సంవత్సరం రిలయెన్స్ జియో.. రిలయెన్స్ రిటైల్ విభాగానికి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
-రిలయెన్స్ రీటైల్‌లో భాగమైన ఏజియోకు ఇషా బ్రాండింగ్, నిర్వాహణ బాధ్యతలు చేపట్టారు.
-ఇషా అంబానీకి సాకర్ ఆడడమంటే ఇష్టమట. యేల్ విశ్వవిద్యాలయం సాకర్ టీమ్ తరపున ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు.
-ప్రస్తుతం ఇషా పేరిట రిలయెన్స్‌లో 8 కోట్ల షేర్లు ఉన్నాయట.
-ఇషాకు పియానో వాయించడం అంటే చాలా ఇష్టం. అందులో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారట.
– ఫ్యాషనబుల్‌గా ఉండడం అంటే ఇష్టమట. ట్రెండ్‌ను ఫాలో అవుతారు.
– 2016లో ఎజియో అనే ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్‌ను లాంచ్ చేశారు.
-2008లో ఫోర్బ్స్ విడుదల చేసిన యంగెస్ట్ బిలియనీర్ వారసురాళ్ల జాబితాలో ఇషా అంబానీ రెండో స్థానం సంపాదించారు.
-ఆసియాలో అత్యంత సమర్థులైన 12 మంది వర్థమాన బిజినెస్ వుమెన్ జాబితాలో ఇషా కూడా ఒకరు.