నేడు షేక్ పేట్ లో మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ అంత్యక్రియలు

351
Mukesh goud
- Advertisement -

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ అనారోగ్యంతో నిన్న మధ్యాహ్నం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయనకు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్, కవిత, హరీష్‌ రావు పలువురు నేతలు ఆయనకు సంతాపం ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇక ఇవాళ మధ్యామ్నం ముఖేశ్ గౌడ్ అంత్యక్రియలు జరుపనున్నారు. అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనార్ధం కొరకు ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు గాంధీభవన్ లో ముఖేశ్ గౌడ్ భౌతికకాయాన్ని ఉంచుతారు.

సాయంత్రం 3 గంటలకు షేక్‌పేట గౌడసమాజ్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముఖేష్‌గౌడ్‌ అంత్యక్రియలు నిర్వహిస్తారు. సభ్యుల్ని కాంగ్రెస్ నేత ఆజాద్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‌, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ పలువురు రాజకీయ నాయకులు పరామర్శించారు.

- Advertisement -