మహేష్‌పై బాలీవుడ్‌ నిర్మాత షాకింగ్ కామెంట్స్‌..

93
- Advertisement -

ఇటీవల టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు బాలీవుడ్‌ ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలు సంచనలంగా మారాయి. బాలీవుడ్‌ నన్నుభరించడం కష్టమని.. అందుకే నా సమయం వృథా చేసుకోనని మహేష్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ సీనియర్‌ నటుడు, నిర్మాత ముకేశ్‌ భట్‌ ఈ వ్యాఖ్యలపై కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

మహేష్‌కు కావాల్సిన సౌకర్యం బాలీవుడ్‌ ఇవ్వలేకపోవచ్చు అని అనుకోవడంలో తప్పులేదు. మహేష్‌ ఎంతో ప్రతిభావంతుడు. ఆయన ప్రయాణాన్ని నేను గౌరవిస్తాను. అయన ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌ హీరో. మహేష్‌ అంచనాలని బాలీవుడ్ అందుకోలేకపోవచ్చు అనడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అయితే అందులో ఎటువంటి తప్పు లేదు’ అని పేర్కొన్నారు.

- Advertisement -