అపర కుబేరులు..అంబానీ నయా రికార్డు!

234
ambani
- Advertisement -

ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్ధానంలో నిలిచారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్‌ అంబానీ. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన టాప్ 50 జాబితాలో టాప్‌ 5లో చోటు దక్కించుకున్నారు అంబానీ.

అంబానీ కంటే ముందు అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, ఫేస్‌బుక్‌ సారథి మార్క్‌ జూకర్‌బర్గ్‌లు మాత్రమే ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా టాప్ బిలియనీర్లలో అమెరికన్లు మాత్రమే చోటు దక్కించుకుండగా తొలిసారి ఆసియా ఖండానికి చెందిన వ్యక్తికి చోటు దక్కింది.

80.2 బిలియన్‌ డాలర్ల (సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు) సంపదతో ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ను దాటేసి నాలుగో స్థానానికి ఎగ‌బాకారు అంబానీ. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తి 187 బిలియన్ డాలర్ల సంపదతో మొదటిస్ధానంలో నిలవగా 121 బిలియన్ల సంపదతో మైక్రోసాఫ్ట్‌ కో ఫౌండర్‌ బిల్‌ గేట్స్ సెకండ్ పొజిష‌న్‌లో ఉన్నారు. ఇక ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఆస్తి 102 బిలియన్ డాలర్లుతో మూడో స్థానంలో ఉన్నారు.

- Advertisement -