- Advertisement -
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున మొక్కలు నాటడం ముఖరా కే గ్రామస్థులకు అనావాయితీగా వస్తుందంటున్నారు సర్పంచ్ గాడ్గె మీనాక్షి. తెలంగాణ ఉద్యమం నుంచే ముఖరాకే గ్రామస్తులకు మంత్రి కేటీఆర్కు విడదీయలేని బంధం ఉందంటున్నారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం 2వేల మొక్కలు నాటారు. నాటడమే కాదు వాటిని సంరక్షిస్తామని ప్రమాణం చేస్తుంటారు. ఇప్పటివరకు ఆ గ్రామంలో 45,000 మొక్కలు నాటి 100% బ్రతికించి.. ప్రకృతిని కాపాడుతున్నామని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె సుభాష్, ఉప సర్పంచ్ వర్ష, సంజీవ్, తిరుపతి, మాదవ్, గ్రామస్తులు పాల్గోన్నారు.
- Advertisement -