పవన్ కు చెక్ పెట్టేందుకే..రంగంలోకి ముద్రగడ?

43
- Advertisement -

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత కొన్నాళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తిరిగి పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. 2009 తర్వాత ఆయన పాలిటిక్స్ కు విరామం పలికారు. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన తిరిగి రాజకీయాల్లోకి రావడం వెనుక వైఎస్ జగన్ వ్యూహరచన ఉందనేది కొందరి అభిప్రాయం. ఈసారి ఎన్నికలను వైఎస్ జగన్ అత్యంత కీలకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడంతో వైసీపీ ఓటు బ్యాంక్ లో చీలిక ఏర్పడే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఈసారి జనసేన పార్టీ కూడా పుంజుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే ముద్రగడను జగన్ రంగంలోకి దించుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బలమైన కాపు సామాజిక వర్గంలో ముద్రగడ ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ ను నిలువరించాలంటే ముద్రగడ నే ప్రధాన ఆయుధంగా జగన్ ఉపయోగించనునట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పవన్ ఎక్కడి నుంచి పోతే చేస్తే అక్కడ వైసీపీ నుంచి ముద్రగడను బరిలో దించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు పవనేమో జగన్ ను టార్గెట్ చేయడం జగనేమో పవన్ ను టార్గెట్ చేయడం జరుగుతూ వచ్చింది. ఇకపై ముద్రగడ ఎంట్రీతో పవన్ వర్సస్ ముద్రగడగా సాగే అవకాశం ఉంది. మరి కొత్త పరిణామాలతో ఈ‌పి‌ఐ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

Also Read:Allu Arjun:బన్నీ అక్కడ కొత్త ఇల్లు కొన్నారా?

- Advertisement -