కాపు యువతను నాశనం చేస్తున్న పవన్!

22
- Advertisement -

కాపు యువత భవిష్యత్‌ను జనసేనాని పవన్ కళ్యాణ్ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభవం. కేవలం చంద్రబాబును గెలిపించేందుకే పవన్ పనిచేస్తున్నారని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో వైసీపీ కాపు సోదరుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన ముద్రగడ…పవన్ తీరును తప్పుబట్టారు.

ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కనుక ఆ 20 సీట్లు కూడా పవన్ త్యాగం చేసి తన పార్టీని విలీనం చేస్తే మంచిదని సూచించారు. పవన్‌ తన సమయాన్ని సినిమా షూటింగ్‌ల కోసం వెచ్చిస్తే మంచిదని…అలా చేస్తే త్యాగశీలిగా మిగిలిపోతావన్నారు.

పవన్ కల్యాణ్ తన చెంచా గాళ్లతో తిట్టిస్తున్నాడని…చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారో ఆలోచించాలన్నారు. 20 సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అవుతావు? నీ వెనుక తిరుగుతున్న యువత తల్లి దండ్రులు ఆవేదనకు గురవుతున్నారన్నారు.

Also Read:స్త్రీలకు ఉపయోగ పడే ‘మర్జరీ ఆసనం’!

- Advertisement -