పవన్ గెలుపు కోసం పనిచేస్తా:ముద్రగడ కూతురు

26
- Advertisement -

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు షాకిచ్చారు ఆయన కూతురు క్రాంతి. పిఠాపురంలో పవన్‌ను ఓడించకపోతే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఆయన శపథం చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై స్పందించిన క్రాంతి.. పవన్‌కు మా నాన్న చేసిన ఛాలెంజ్ చాలా బాధాకరమైనదన్నారు. పవన్‌ను ఓడించి పిఠాపురం నుంచి పంపించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న కాన్సెప్ట్ ఏంటో తనకు అర్థం కాలేదని తెలిపింది. ఇది ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదని, రాజకీయాల్లో హుందాగా ఉండాలన్నారు.

ఎన్నికల తర్వాత మానాన్నను వైసీపీ వదిలివేయడం ఖాయమన్నారు క్రాంతి. ఈ విషయంలో మా నాన్నను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పవన్ గెలుపుకు తన వంతు కృషి చేస్తారన్నారు.

Also Read:కేఎల్ రాహుల్‌ స్థానంలో శాంసన్!

- Advertisement -