ఎస్పీలో పెను సంక్షోభం…అఖిలేష్‌ పై వేటు

249
Mualayam expels Akhilesh
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌ సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం ముదిరిపాకాన పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ముఖ్యమంత్రి అఖిలేష్ సహా సీనియర్ నేత,సోదరుడు రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు ఆ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్. అఖిలేష్ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారంటూ మండిపడ్డ ములాయం..ఆరు సంవత్సరాల పాటు బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఎంతో కష్టపడి పార్టీని నిర్మించానని…నేను పార్టీ స్ధాపించినప్పుడు వీరంతా ఎక్కడా ఉన్నారని మండిపడ్డారు. అఖిలేష్ క్షమాపణ చెబితే సస్పెన్షన్ ఎత్తివేతపై ఆలోచిస్తామని తెలిపారు. పార్టీని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.త్వరలో కొత్త సీఎంను ఎన్నుకుంటామని ములాయం తెలిపారు.

సమాజ్ వాది పార్టీ అసలైన కార్యకర్తలం మేమేనని అఖిలేష్ తెలిపారు. ములాయమే మా నేతని స్పష్టం చేశారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం మమ్మల్ని బహిష్కరించటం అనైతికమని తెలిపారు.మరోవైపు ఎస్పీ ప్రధాన కార్యాలయం ముందు అఖిలేష్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ములాయంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అమర్ సింగ్ పార్టీలో చేరినప్పటి నుంచి వివాదాలు జరుగుతునే ఉన్నాయి. కొద్దికాలంగా అమర్‌ సింగ్‌పై అఖిలేష్ బహిరంగ విమర్శలు చేయటం….దానిని ములాయం ఖండిచడం జరుగుతునే ఉంది.యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 325 మంది అభ్యర్థుల జాబితాను ములాయం సింగ్‌ రెండు రోజుల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం అఖిలేశ్‌ సొంతంగా గురువారం రాత్రి మరో 235 మంది సభ్యుల జాబితాను విడుదల చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ములాయం…అఖిలేష్‌కు షోకాజు నోటీసులు పంపించారు. మీడియా ఎదుట పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు గాను మరో సోదరుడు రాంగోపాల్‌ యాదవ్‌కు షోకాజ్‌ నోటీసులు పంపించారు.

రానున్న ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ ప్రకటించిన జాబితా ప్రకారమే ఎన్నికల్లో పోటీచేస్తామని ములాయం సోదరుడు,బహిష్కృత నేత రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు. రెండుమూడు రోజుల్లో తుది జాబితాను సిద్ధం చేస్తామని….ఈ మేరకు పార్టీ సభ్యులు జనవరి 1న అత్యవసర సమావేశం కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -