పత్తి రైతులకు చెల్లించే మద్దతు ధరలో తేడా రావొద్దని అధికారులకు సూచించారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నగదు చెల్లింపులు వెంటనే జరగాలి … గోదాంలను పరిశీలించుకుని అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
పత్తి మొదటిరకం రూ.5,550, రెండో రకం రూ.5,255 చెల్లించాలని గత ఏడాది 230 మిల్లులు గుర్తింపు, 37 మార్కెట్లలో కొనుగోళ్లు ఈ ఏడాది 302 మిల్లులు గుర్తించడం జరిగిందన్నారు. మిల్లుల వద్ద అన్ని సదుపాయాలు కల్పించాలి… తూకం విషయంలో ఎలాంటి తేడాలు రావద్దు .. వే బ్రిడ్జ్ లు సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు.
అనుమతించిన ఛార్జీలకు మించి రైతుల నుండి ఒక్క పైసా ఎక్కువ వసూలు చేయోద్దని చెప్పారు. క్యూఆర్ కోడ్ ఉన్న రైతులను గుర్తించి ఇది వరకే గుర్తింపు కార్డులు ఇచ్చారని… స్థానిక అధికారులు గుర్తింపు లేని రైతులను గుర్తించి క్యూఆర్ కోడ్ ఇవ్వాలన్నారు. పత్తి కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో ఆన్ లైన్ లో డబ్బులు జమచేయాలన్నారు.
వివరాల లోపం పేరుతో డబ్బులు జమచేయడంలో జాప్యం జరగడానికి వీళ్లేదు వారానికి ఆరురోజులు పనిచేయాలి పత్తి విత్తనాల ధరల హెచ్చుతగ్గులను బట్టి పత్తి ధరలో తేడాలు ఉండే అవకాశం ఉంది.
గత ఏడాది కన్నా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 3.5 శాతం నుండి 5 శాతం ఎక్కువ దిగుబడి వస్తుందని అంచనా. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 34.59 మిలియన్ హెక్టార్లలో పత్తిసాగు చేయాలన్నారు.
కొనుగోలుకు సంబంధించి రైతులను చైతన్యపరిచేందుకు ప్రకటనలు, ప్రచార సామాగ్రి సమకూర్చుకుని అవగాహన కల్పించాలి…జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేసుకోవాలని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత సీసీఐ, మార్కెటింగ్ అధికారులదేనని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సీసీఐ (కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) ఎండీ అలీరాణి , వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి , వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా , మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు