గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన కవిత

666
trs kavitha
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ చాలెంజ్‌ని స్వీకరించారు మాజీ ఎంపీ కవిత. హైదరాబాద్‌లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు . రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం రోజురోజుకు వేగంగా విస్తరిస్తుందన్నారు . గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం కొనసాగుతున్న తీరుపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

mp kavitha

మొక్కలు నాటే కార్యక్రమం పోటీ తత్వంతో సాగేలా చేయడం చాలెంజ్ కార్యక్రమం ఉద్దేశ్యం. విరివిగా మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యం పెరిగి స్వచ్ఛ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది..తద్వారా భూతాపం పెరగడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం, అతివృష్టి లేదంటే అనావృష్టి, వాతావరణ మార్పులు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చనే విషయాన్ని అందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా ఎంపి కవిత అన్నారు.

trs

ఈ సందర్భంగా ఇగ్నైటెడ్ మైండ్స్ కో ఫౌండర్ రాఘవ మాట్లాడుతూ త్వరలోనే కవిత మరో ఐదుగురిని నామినేట్ చేస్తారని తెలిపారు.

- Advertisement -