ప్రపంచ వ్యాప్తంగా మానవ మనుగడకు ప్రమాదకరంగా మారిన కరోనా మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది. దేశంలోనే ఈ మహమ్మారిపై మన ముఖ్యమంత్రి స్పందించిన తీరు దేశానికె ఆదర్శం. కరోనా మహమ్మారి నుండి రాష్ట్ర ప్రజలను కాపాడడానికి అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్స్, మునిసిపల్ సిబ్బంది, పోలీసులు, మిగతా ప్రభుత్వ శాఖలకు చేయూత నివ్వడానికి ‘ఎంఎస్‌ఎంఈ’ పరిశ్రమలు తమ సామజిక భాద్యతగా భావిస్తున్నాయి.
ఈ లాక్‌డౌన్ వల్ల ‘ఎంఎస్‌ఎంఈ’ పరిశ్రమలకు రాబోయే రోజుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నప్పటికీ, పారిశ్రామిక వేత్తలు టీఐఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు ముందుకు వచ్చి రూపాయలు.1,22,42,419 లను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఈరోజు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమస్య అధ్యక్షులు కే. సుధీర్ రెడ్డి, కార్యదర్శి సరే ఎస్. వి. రఘు, సంయుక్త కార్యదర్శి మిరుపాల గోపాల్ రావు, TSIIC MD E.V.నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.