మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్ల నుంచే పూర్తి స్థాయిలో ర్యాంపేజ్ మోడ్‌లో దూసుకెళ్తోంది. ఈ చిత్రం, చిరంజీవి కెరీర్‌లోనే కాకుండా దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లో కూడా ఉత్తర అమెరికాలో అత్యధిక ప్రీమియర్ గ్రాస్ నమోదు చేసి రికార్డు సృష్టించింది.
ముఖ్యంగా బుక్‌మైషోలో గత 24 గంటల్లోనే ఈ సినిమాకు 4.88 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఉన్న భారీ డిమాండ్‌కు ఇది స్పష్టమైన నిదర్శనం. సోమవారం విడుదలైనప్పటికీ, డే 1 కలెక్షన్లు అసాధారణంగా ఉండబోతున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు వసూళ్లు భారీగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఈ చిత్రంలో నయనతార, కేథరిన్ ట్రెసా, సచిన్ ఖేడేకర్, జరీనా వహాబ్, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో నటించారు. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించారు.
Also Read:KTR:కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు

