ఉప్పు అందరికీ హానికరమా?

8
- Advertisement -

వంటకు రుచి ఇచ్చే ఉప్పు ఇప్పుడు అందరి పాలిట శత్రువగా మారింది. మానవ శరీరానికి సోడియం అత్యవసరం. ఇది నాడీ సంకేతాలు, కండరాల కుదింపు, శరీరంలోని ద్రవ సమతుల్యత, రక్తపోటు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో ఉప్పు తానే తాను హానికరం కాదు. వ్యక్తిగత శరీర స్వభావాన్ని పక్కన పెట్టి అందరికీ ఒకే పోషక నియమాలు పెట్టినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది.

ప్రతి ఒక్కరి శరీరంలో ఉప్పు ఒకేలా పని చేయదని డాక్టర్లు చెబుతున్నారు. కొంతమంది శరీరాల్లో ఉప్పు కేవలం రుచి కాదు… వ్యాధికి ఇంధనం అని చెబుతున్నారు. ముఖ్యంగా గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) ఉన్నవారు. సోడియం వల్ల శరీరంలో ద్రవం నిల్వ అవుతుంది. దాంతో శ్వాస ఇబ్బంది, పదేపదే ఆసుపత్రిలో చేరడం, జీవనకాలం తగ్గే ప్రమాదం పెరుగుతుందని ఆయన చెప్పారు.

నియంత్రణలోకి రాని అధిక రక్తపోటు ఉన్నవారు. మూడు లేదా నాలుగు మందులు వాడినా బీపీ అదుపులోకి రాకపోతే, ఉప్పు ఇక న్యూట్రల్ కాదు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నవారు. అధిక సోడియం కిడ్నీల పనితీరును వేగంగా దెబ్బతీస్తుంది. శరీర ద్రవాల సమతుల్యతను మరింత కష్టతరం చేసి, పరిస్థితిని క్రమంగా మరింత చెడగొడుతుంది.

Also Read:Delhi AQI:మూడేళ్లలో ఇదే తొలిసారి!

కాలేయ సిర్రోసిస్, పోర్టల్ హైపర్‌టెన్షన్ ఉన్నవారు.ఇక్కడ ఉప్పు నేరుగా ద్రవం పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఆయన చెప్పినట్టు,“అసైటిస్‌కు మీ రుచి అభిరుచులతో పని లేదు.”.వయసు పెరిగి రక్తనాళాలు గట్టిపడిన వృద్ధులు.వయసుతో పాటు రక్తనాళాలు సోడియాన్ని సమర్థంగా నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. దాంతో ఉప్పు తీసుకుంటే రక్తపోటు సులభంగా పెరుగుతుంది.

- Advertisement -