మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు (MSG) బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం థియేటర్లలో అద్భుతమైన స్పందనను రాబట్టి, టికెట్ అమ్మకాలు, వసూళ్ల పరంగా భారీ దూకుడు చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలోనూ సినిమా బలంగా కొనసాగుతోంది.
చిత్రబృందం అధికారికంగా రెండు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లను ప్రకటించింది. విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే మన శంకర వరప్రసాద్ గారు రూ.100 కోట్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ వసూళ్లు రూ.120 కోట్లకు పైగా ఉన్నట్లు వెల్లడించారు. ఇది చిరంజీవికి బాక్సాఫీస్ వద్ద ఓ అద్భుతమైన కమ్‌బ్యాక్‌గా నిలుస్తోంది.
ఈ చిత్రంలో నయనతార, క్యాథరిన్ ట్రెసా, సచిన్ ఖేడేకర్, జరినా వాహబ్, హర్ష వర్ధన్ కీలక పాత్రల్లో నటించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
Also Read:దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి

