మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి నిన్న థియేటర్లలోకి వచ్చింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్–కామెడీ ఎంటర్‌టైనర్‌లో అశికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటించారు.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే విమర్శకుల నుంచి సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద వేగం పెంచితేనే గౌరవప్రదమైన మొత్తాన్ని నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవల రవితేజ నటించిన వరుస చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, అలాగే గట్టి పోటీ ఉండడం కలెక్షన్లపై ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో సత్య, వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు.
Also Read:దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి

