మెగాస్టార్ చిరంజీవి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు బుక్‌మైషోలో, ప్రపంచవ్యాప్త వసూళ్లలో సంచలనాత్మక మైలురాళ్లను సాధించింది. 3.7 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి. ఓ రీజనల్ సినిమాకు ఇన్ని టికెట్లు అమ్ముడవడ్వడం ఇదే తొలిసారి.
మన శంకరవరప్రసాద్ గారు బుక్‌మైషోలో ఆల్‌టైమ్ నంబర్ 1 రీజినల్ ఫిల్మ్ గా నిలిచింది, 15వ రోజుకే 3.6 మిలియన్ టికెట్లు అమ్ముడై, ఇప్పటివరకు రికార్డు కలిగిన సంక్రాంతికి వస్తున్నాం (3.5 మిలియన్)ను అధిగమించింది. ఈ ఘనతను సాధించిన ఫాస్టెస్ట్ రీజినల్ ఫిల్మ్ గా MSG రికార్డ్ క్రియేట్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా MSG కేవలం 15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. గాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే హైయెస్ట్ రికార్డ్స్ నమోదు అవుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరికీ ఇదే బిగ్గెస్ట్ గ్లోబల్ ఎర్నర్ గా నిలిచింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని అత్యున్నతంగా నిర్మించారు.
Also Read:మహా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్!

