హెలికాప్టర్‌ డే !

236
MS Dhoni Turns 36
- Advertisement -

భారత్ జట్టుకి టీ20 కెప్టెన్‌గా ఎంపికైన కొద్దినెలలకే టీ20 ప్రపంచకప్..  కోట్లాది మంది అభిమానులు 28 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్.. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా ఐసీసీ మూడు టోర్నీల్లోనూ జట్టును విజేతగా నిలిపిన ఏకైక భారత్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పుట్టినరోజు నేడు.. ఒకవైపు విండీస్‌పై 3-1 తేడాతో సిరీస్‌ గెలుపొందిన సంబరంతోపాటు.. ధోనీ నేడు 36వ ఏట అడుగుపెడుతున్న పుట్టినరోజు వేడుకను కూడా జరుపుకుంటోంది టీమిండియా. అంతేకాదు టీమిండియా మాజీలు సోషల్ మీడియాలో ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు..

matchwinn

ధోనీకి టీంలో స్పెషల్ ఫ్రెండ్‌ యువరాజ్‌ సింగ్‌ తనదైన స్టైల్లో చెప్పాడు. మిస్టర్‌ హెలికాప్టర్‌ ధోనీ మరిన్ని పుట్టిన రోజుల జరుపుకోవాలని కోరుకుంటున్నా. గ్రేట్‌ డే బడ్డీ. నీ కోసం కేకు ఎదురుచూస్తోందంటూ యువీ ట్వీట్ చేశాడు.. ఇక స్పెషల్ ట్వీట్లతో అలరించే సెహ్వాగ్.. ‘భారత అభిమానులకు మధురానుభూతులను అందించిన వారి ఆనందానికి కారణమైన ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. హెలికాప్టర్‌ షాట్లతో అదరగొడుతూ మన గుండెల్లో నిలవాలి’ అంటూ ధోనీకి విషెస్ చెప్పాడు.. మహ్మద్‌ కైఫ్‌,వీఎస్‌ లక్ష్మణ్‌,హార్దిక్‌ పాండ్య,ఐసీసీ, బీసీసీఐలు తమ విషెస్‌ని తెలిపారు..

dhoni

గంగూలీ తర్వాత టీమిండియాను విజయాల వైపు నడిపిన నాయకునిగా మన్ననలు పొందిన మహేంద్రసింగ్ ధోనీ…టీమిండియా వన్డే, టీ 20 కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనానికి వేదికయ్యాడు. 2007లో ద్రావిడ్‌ నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన ధోనీ.. పదేళ్ల పాటు భారతకు ఎన్నో ఘన విజయాలు అందించాడు. 2007లో ఐసీసీ వరల్డ్‌ టీ-20, 2011లో వన్డే వరల్డ్‌కప్‌, 2013లో చాంపియన్స్‌ ట్రోఫీలను మహీ నేతృత్వంలో టీమిండియా సాధించింది. కపిల్ తర్వాత భారత్‌కు ప్రపంచకప్‌ అందించిన ధోని…పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లోనూ తనదైన ముద్రవేశాడు. అంతేగాదు టీమిండియాను 2009లో టెస్టుల్లో టాప్‌ ర్యాంకులో నిలబెట్టాడు. ధోనీ నాయకత్వంలో భారత 199 వన్డేలు ఆడితే.. 110 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 72 టీ-20ల్లో 41 నెగ్గి.. 28 మ్యాచ్‌ల్లో ఓడింది.

ms-dhoni-

296 వన్డేలాడిన ధోని.. 9496 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 64 అర్ధసెంచరీలు ఉన్నాయి. 76 టీ20 మ్యాచ్‌లు ఆడిన మహి 1209 పరుగులు సాధించాడు. ధోని సారథ్యంలో భారత్‌ 2015 ప్రపంచకప్‌, 2016 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది. ఐపీఎల్‌లో కూడా ధోని మెరుపులు మెరిపించాడు. అతను నేతృత్వం వహించిన చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు రెండు సార్లు టైటిల్‌ గెలుచుకుంది. రెండుసార్లు ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 కప్‌ను కూడా గెలుచుకుంది.

- Advertisement -