ఐపీఎల్‌ బెస్ట్ కెప్టెన్స్‌ ఎవరో తెలుసా..!

290
dhoni
- Advertisement -

పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో సంచలనం ఐపీఎల్. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ టోర్నీ సక్సెస్ ఫుల్ టోర్నిగా సాగుతోంది. ఇక ఐపీఎల్ 13వ సీజన్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో కరోనా నేపథ్యంలో చెక్ పడింది.

ఈ ఏడాది కరోనా కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. ఐపీఎల్ ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్.. సుమారు 50 మంది జ్యూరీ సభ్యుల అభిప్రాయాల ఆధారంగా వివిధ కేటగిరీలో ఆటగాళ్లని ఎంపిక చేసింది.

ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్స్ లిస్ట్‌ని ప్రకటించారు. ధోని, రోహిత్ శర్మ ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్స్ అని అభిప్రాయపడ్డారు. ధోని సారధ్యంలోని చెన్నై మూడు సార్లు టైటిల్ గెలవగా ముంబై నాలుగు సార్లు టైటిల్ విన్నర్‌గా నిలిచింది.

- Advertisement -