మళ్లీ వచ్చిన మహేంద్రసింగ్ ధోనీ..

298
Ms Dhoni

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ టీ20 జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ అనంతరం ప్రారంభమయ్యే.. వన్డే సిరీస్, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ-20 సిరీస్‌ల కోసం టీం ఇండియా వివరాలను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ జట్లలో టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి.. తిరిగి చోటు కల్పించారు. ఇటీవల ధోనీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు.

MS Dhoni

భారత జట్టుకు తొలి టీ20 ప్రపంచకప్‌ను అందించిన మహేంద్ర సింగ్ ధోనీని వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగిన‌ టీ20 సిరీస్‌లకు ఎంపిక చేయ‌ని విష‌యం తెలిసిందే. టీమ్ఇండియా ఆడిన గ‌త ఆరు టీ20ల్లో ధోనీకి విశ్రాంతినిచ్చారు. ఇటీవ‌ల గాయం నుంచి కోలుకొని టెస్టు జ‌ట్టులోకి వ‌చ్చిన ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య టీ20ల‌తో పాటు వ‌న్డే టీమ్‌లోకి పున‌రాగ‌మ‌నం చేశాడు.