టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ధోనీ..

113
dhoni

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌-2020లో శుక్రవారం మరో ఆసక్తికర మ్యాచ్‌ జరుగుతోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌.,ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకున్న లుంగీ ఎంగిడి స్థానంలో జోష్‌ హేజిల్‌వుడ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు ఢిల్లీ జట్టులోనూ రెండు మార్పులు చేసినట్లు కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ వివరించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో గాయపడిన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో అమిత్‌ మిశ్రా..పేసర్‌ మోహిత్‌ శర్మ స్థానంలో ఆవేశ్‌ ఖాన్‌ బరిలో దిగుతున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్:పృథ్వీ షా, శిఖర్ ధావన్, షిమ్రాన్ హెట్‌మైర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్ పంత్, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అమిత్ మిశ్రా, అన్రిచ్ నోర్జ్, అవేశ్ ఖాన్.

చెన్నై సూపర్‌ కింగ్స్:మురళీ విజయ్, షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని (w / c), సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, జోష్ హాజిల్వుడ్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా