జీవాతో ధోనీ అదిరే డ్యాన్స్

214
dhoni
- Advertisement -

ఐపీఎల్ తర్వాత ఫ్యామిలీతో కలిసి ఓ పార్టీలో మెరిశాడు ఎంఎస్ ధోనీ. భార్య సాక్షి,కుమార్తె జీవాతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ఇది చూసేటప్పుడు మనం నవ్వకుండా ఉండగలమా? ఖచ్చితంగా కాదు” అని క్యాప్షన్‌ జతచేసింది.

ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని…ఐపీఎల్‌కు మాత్రం ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 39 ఏళ్ల ధోని 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడు. సీఎస్‌కే 2010, 2011, 2018 సీజన్‌లలో మూడు టైటిళ్లను సొంతం చేసుకుంది.

- Advertisement -