వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న చెన్నైకి గట్టిషాకిచ్చింది కోల్ కతా. ప్లే ఆఫ్స్ స్ధానం కోసం పోటీ పెరుగుతున్న సమయంలో చక్కని ప్రదర్శన చేసింది. శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్ మెరవడం కోల్ కతా ఘన విజయం సాధించింది. కోల్‌కతాకు ఇది ఐదో విజయం కాగా చెన్నై మూడో పరాజయాన్ని చవిచూసింది.
కోల్‌కతాతో పరాజయం కావడంపై ధోని అసంతృప్తిని వ్యక్తం చేశారు. జట్టు సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. పేలవ ఫీల్డింగ్, బౌలింగ్‌తో కేకేఆర్,బౌలింగ్ విఫలం కావడంతో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి నుంచి తృటిలో తప్పించుకుంది.
ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్‌తో చెత్త ప్రదర్శన కనబర్చారు చెన్నై ఆటగాళ్లు. ఉత్తమ ఫీల్డర్‌గా పేరున్న జడేజా వరుస బంతుల్లో సునీల్ నరైన్ క్యాచ్‌లను జార విడిచారు. లైన్ అండ్ లెంగ్త్‌ను వదిలేసి, కేకేఆర్ బ్యాట్స్‌మన్లకు చెన్నై బౌలర్లు పరుగులు సమర్పించుకున్నారు. వాస్తవానికి ఏడో ఓవర్ వచ్చే సరికి క్రిస్ లిన్, రాబిన్ ఉతప్ప, సునీల్ నరైన్‌లను చెన్నై బౌలర్లు పెవిలియన్‌కు పంపారు. ఆ తర్వాత వచ్చిన యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్, కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌లు జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. ఫీల్డింగ్,బౌలింగ్ లోపాలే జట్టు ఓటమికి కారణమని ఈ పొరపాట్లు తర్వాతి మ్యాచ్‌లలో జరగకుండా చూసుకంటామని చెప్పారు ధోని.