ఈ సినిమా హిట్ అయిందంటే కారణం..

237
Kota srinivas rao comments on rangastalam movie
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రంగస్థలం’. ఈ చిత్రం గత నెల కిందట విడుదలై నాన్ బాహుబలిగా రికార్డులను సృష్టించింది. ఇందులో సమంతా కథ నాయికగా నటించగా అది, అనసూచ తదితరులు నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికి ప్రశంసలు దక్కాయి.

Kota srinivas rao comments on rangastalam movie

ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుంచే కాక రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువ కురుస్తూనే ఉంది. విడుదలైన నెల రోజులకే రూ.200 కోట్లు వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బాహుబలి చిత్రం తర్వాత సినిమాగా నిలిచింది ‘రంగస్థలం’. ఈ సినిమాకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్ర యూనిట్‌కు, రామ్ చరణ్‌కు, దర్శకుడు సుకుమార్‌కు ప్ర్తత్యేక అభినందనలు తెలిపారు.

తాజాగా ఈ సినిమాకు మరో సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ రావు ఈ సినిమాపై ప్రశంసలు కురిపంచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..నటీ నటులు ఎవరైనా సరే సాధన చేస్తేనే పైకి వస్తారు. ఈ మధ్య విడుదలైన ‘రంగస్థలం’ సినిమానే దీనికి ఉదాహరణ అంటూ అన్నారు. ఈ చిత్రం ఇంత పెద్ద హిట్‌ అయిందంటే కారణం దాని వెనుక ఎంతో కృషి ఉంది. ఆ సినిమాలో విషయం ఉంది కాబట్టే సినిమా పెద్ద హిట్ అయిందన్నారు. మంచి కథ ఉన్న బలం ఉన్న సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయని కోట శ్రీనివాసరావు తెలిపారు.

- Advertisement -