సినీ రంగంలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలైన సరైన గుర్తింపు దక్కలేదు ఆ అమ్మడికి. కానీ ఒకే ఒక్క సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. సీతారామం సినిమాలో సీతగా కనువిందు చేసింది.ఈ సినిమాలో తన అందచందాలతో ఆకట్టుకుంది.ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.
తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు సన్నద్ధమవుతుంది. ప్రొఫేషనల్ కిక్ బాక్సర్, మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ రోహిత్ నాయర్ వద్ద శిక్షణ తీసుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఫర్హాన్ అక్తర్‌తో కలిసి `టూఫాన్` చిత్రంలో నటించింది. బాక్సింగ్‌నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఇందులో ఫర్హాన్ బాక్సర్‌గా కనిపి అందులో మృణాల్ కొన్నియాక్షన్ సీన్లు కూడా చేసింది. ఆ టైమ్‌లో మృణాల్‌కి కిక్ బాక్సింగ్‌పై ఆసక్తి ఏర్పడటంతో దానిని కంటిన్యూ చేస్తోంది.
రోహిత్ నాయర్ వంటి ప్రొఫెషనల్ కోచ్ దగ్గర శిక్షణ పొందాలంటే తప్పకుండా చాలా కృషి మరియు అంకితభావం అవసరం అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. తెలుగులో నానితో `హాయ్ నాన్న` చిత్రంలో నటిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండతో పరశురామ్, హిందీలో మూడు సినిమాలకు ఓకే చెప్పేసింది.
Also Read:అరవింద్‌కు వార్నింగ్ ఇచ్చిన కవిత