లెఫ్ట్‌నెంట్ రామ్‌లో మృణాల్..!

97
leftnent ram
- Advertisement -

హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లెఫ్టినెంట్ రామ్‌. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నుంచి దుల్కర్ బర్త్ డే సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

మేకర్స్ తాజాగా ఈ వార్ డ్రామాలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి పేరును వెల్లడించారు. ఆమె మరెవరో కాదు మృణాల్ ఠాకూర్. ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ ప్రేయసిగా ఈ చిత్రంలో ఆమె సీత పాత్రను పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టర్ లో మృణాల్ చాలా అందంగా ఉంది. ఆమె దుల్కర్ సల్మాన్ కళ్ళలోకి సూటిగా చూస్తోంది. దుల్కర్, మృణాల్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రం ఇదే.

మృణాల్ ఠాకూర్ చివరిసారిగా తూఫాన్ లో కనిపించారు, ఇందులో ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో మృణాల్ అనన్య పాత్రలో నటించింది. 2019లో ఠాకూర్ యాక్షన్ థ్రిల్లర్ “బాట్లా హౌస్‌”లో మృణాల్ కన్పించింది.

- Advertisement -