ప్రభాస్ కి ‘రాధ’గా ఆమె ఫిక్స్

20
- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణే హీరో హీరోయిన్లుగా ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రూపుదిద్దుకుంటున్న విషయం విదితమే. ఐతే, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఈ ‘కల్కి 2898 AD’ కోసం భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమా కోసం దీపికా సుమారు రూ.20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమా కనుక ఈ బాలీవుడ్ భామ అంతగా డిమాండ్ చేస్తుందని సమాచారం.

మరి నిజంగానే దీపికా పదుకొణే అంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందా ?, ప్రస్తుతానికి అయితే, దీపికా పదుకొణేకి ఫుల్ డిమాండ్ ఉంది. పైగా ఒకేసారి దీపికాకి మూడు భారీ ప్రాజెక్టులు చేతిలో ఉండటంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ పాన్ వరల్డ్ సినిమా కల్కిలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కూడా నటిస్తున్నారు. అలాగే, ఈ హిందూ మైథలాజి బ్యాక్ డ్రాప్‌తో రానున్న ఈ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డెట్ కూడా అందుతోంది.

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా నటించనుందట. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో ‘రాధ’ పాత్రతో కనిపించబోతున్నారని టాక్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజం అయితే, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే అవుతుంది. అన్నట్టు మరో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడట. మరి ఈ సినిమాలో దుల్కర్ నటిస్తే.. మలయాళంలో కూడా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయి.

Also Read:త్రివిక్రమ్ తో గ్యాపే కొంప ముంచింది

- Advertisement -