ప్చ్.. మృణాల్ మొదటి సంపాదన అంతే!

25
- Advertisement -

తెరపై సహజంగా కనిపించడానికే తాను ప్రాధాన్యతనిస్తానని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చెప్పారు. మృణాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కొందరు నన్ను బరువు తగ్గితే బాగుంటుందని చెబుతుంటారు. కానీ, ఆ అవసరం లేదు. తెరపై సహజంగా కనిపించడానికే ప్రాధాన్యతనిస్తాను. దర్శకుల సూచనల మేరకు నటిస్తే ఏ పాత్రలోనైనా రాణించవచ్చని నమ్ముతాను’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ ‘ఫ్యామిలీ స్టార్‌’లో నటిస్తోంది. అలాగే, తన తొలి సంపాదన గురించి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

మృణాల్ ఠాకూర్మాట్లాడుతూ.. ‘‘మోడలింగ్‌లో నా తొలి సంపాదన రూ.6 వేలు. ఇవాళ నేను ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రులు, సన్నిహితుల ప్రోత్సాహమే కారణం. వాళ్లు లేకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి’’ అని ఠాకూర్ పేర్కొన్నారు. అలాగే, మృణాల్ ఠాకూర్ తన సినీ జీవితం పై పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. తాను నటిగా ఎదిగే క్రమంలో మొదట్లో తన తల్లిదండ్రులు తాను యాక్టింగ్ చేసేందుకు ఒప్పుకోలేదని చెప్పింది. ఇంట్లో నుంచి వచ్చేసి క్యాస్టింగ్ కౌచ్ వల్ల అవకాశాలు వదులుకున్నట్లు పేర్కొంది. ఇక మృణాల్ ఠాకూర్ కొత్త సినిమాల విషయానికి వస్తే ఆమెకు ఓ భారీ సినిమా వచ్చింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘RC16’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న విషయం తెలిసింది. ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఫస్ట్ హీరోయిన్‌గా నటించనుంది. అయితే, ఈ సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది అని, ఈ ఎపిసోడ్ లో ఓ సెకండ్ హీరోయిన్ కి అవకాశం ఉంది అని, ఇప్పుడు ఈ పాత్రలో మృణాల్ ఠాకూర్ ను ఫైనల్ చేశారు అని తెలుస్తోంది. మొత్తానికి మృణాల్ కి మరో భారీ ఆఫర్ దక్కింది.

Also Read:Trisha:అసలు ‘త్రిష’కే ఎందుకు ఇలా?

- Advertisement -