రెమ్యునరేషన్ బాగా తగ్గించేసుకుంది!

23
- Advertisement -

అందాల బొమ్మ ‘మృణాల్ ఠాకూర్’ రెమ్యూనరేషన్ రేంజ్ ఒక్క సారిగా ఢమాల్ న పడిపోయిందట. ‘సీతా రామం’ సినిమాతో ఫాంలోకి వచ్చి.. ఈ అమ్మ‌డు భారీగానే పారితోషికం తీసుకుంది. ఒక్కో సినిమాకి రెండు కోట్లు ఛార్జ్ చేసిన సంద‌ర్భాలున్నాయి. అద‌నంగా సొంత ప్లైట్ వేసుకుని రావ‌డం..ఆ ఖ‌ర్చులు నిర్మాత నెత్తిన వేయ‌డం..ఇంకా అద‌న‌పు సిబ్బంది ఇలా ఓ రేంజ్ లో మృణాల్ ఠాకూర్ మెయింటెన్ చేసింది. పైగా, హిందీ బోల్డ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’ రిలీజ్ అయ్యాక, మృణాల్ ఠాకూర్ కి హిందీలో కూడా మార్కెట్ పెరిగింది.

దీంతో, మృణాల్ ఠాకూర్ కి వరుసగా ఆఫర్స్ వచ్చాయి. ఫలితంగా భారీగా డిమాండ్ చేసింది. ఫ్యామిలీ స్టార్ అనే కొత్త సినిమాకి కూడా రెండు కోట్లు అడిగి తీసుకుంది. ఇక హాయ్ నాన్న అంటూ నానితో చేసిన సినిమాకి కూడా దాదాపు రెండు కోట్లకు దగ్గరలో తీసుకుంది. ఐతే, హాయ్ నాన్న కమర్షియల్ గా ప్లాప్ అయ్యింది. మృణాల్ ఠాకూర్ రేంజ్ ఇప్పుడు ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ లా కుప్ప కూలిపోతోందట. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్కో సినిమాకి రెండు కోట్లు అందుకున్న భామ ఒక్క‌సారిగా కోటికి ప‌డిపోయిందట‌.

అంత‌కు మించి త‌క్కువ ఇచ్చినా స‌రే సైన్ చేయ‌డానికి సిద్దంగానే ఉందని బాలీవుడ్ గుసగుసలాడుతోంది. మిడ్ రేంజ్ హీరోలే అవ‌స‌రం లేద‌ని.. రేంజ్ లేని హీరోలైనా సినిమాలు చేయ‌డానికి సిద్ధమనే సంకేతాలిస్తోందట మృణాల్ ఠాకూర్. మొన్నటి వరకూ ఓ రేంజ్ లో సందడి చేసిన మృణాల్ ఠాకూర్ కి ఇప్పుడు తెలుగులో అవ‌కాశాలే రావ‌డం లేదు. కోలీవుడ్ లోనూ అంతేనట. ఏది ఏమైనా మృణాల్ ఠాకూర్ కు ఇక స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం కష్టమే!.

Also Read:గ్లామర్ ను నమ్ముకున్న మరో బ్యూటీ

- Advertisement -