మృణాల్ ఠాకూర్.. టాలీవుడ్ లోకి ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ. అందంలోనే కాదు, అటు అభినయంలోనూ మృణాల్ ఠాకూర్ కి మంచి గుర్తింపు ఉంది. చాలా తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతానికి మృణాల్ ఠాకూర్ తాను హీరోయిన్ గా వస్తోన్న హాయ్ నాన్న సినిమా కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ తన పర్సనల్ విషయాల గురించి కూడా కొత్త ముచ్చట్లు చెప్పింది. అందులో భాగంగానే ఆమె ఇప్పటివరకు లవ్ లో పడలేదట, ఎవ్వరితో ప్రస్తుతం డేటింగ్ లో కూడా లేదట.
నిజమే.. మృణాల్ ఠాకూర్ కు ప్రేమించేంత టైమ్ ఇప్పుడు లేదు. అయితే, తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో ఓ ఐడియా ఉందంటోది మృణాల్ ఠాకూర్. మరీ ముఖ్యంగా తనకు కాబోయే వాడిలో రెండు క్వాలిటీస్ మస్ట్ గా ఉండాలంటోంది. ఆ క్వాలిటీస్ ఉన్న కుర్రాడ్నే తను ఇష్టపడతానని చెబుతోంది మృణాల్. ఇంతకీ మొదటి క్వాలిటీ ఏంటంటే, మృణాల్ ఠాకూర్ ను పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి చాలా గట్స్ ఉండాలట. ఎందుకంటే ఆమె లిస్ట్ చాలా పెద్దది అట. అందుకే బోలెడంత డబ్బు కూడా ఉండాలట. తన కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉండాలట.
ఇక మృణాల్ ఠాకూర్ చెప్పిన రెండో క్వాలిఫికేషన్ ఏంటంటే, నా కాబోయే భర్తకు మంచి హాస్య చతురత ఉండాలి. అలాగే, నాకు కాబోయే భర్త కాస్త ఫ్యామిలీ టైపులో అందంగా, పద్ధతిగా ఉండాలి. ఇలా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో వివరించింది మృణాల్ ఠాకూర్. మొన్నటివరకు ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్ తో మీడియాలో కనిపించిన ఈ బ్యూటీ, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నెటిజన్ల ముందుకొచ్చింది. అన్నట్టు ‘హాయ్ నాన్న’ సినిమాకు ప్రధాన ప్రచారాస్త్రం మృణాల్ ఠాకూరే అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం.
Also Read:Congress:ఛలో ఢిల్లీ..సీఎం లొల్లి?