హాట్ హాట్ టీజర్‌తో మిస్టర్ అండ్ మిసెస్..!

241
Mr & Misses Teaser
- Advertisement -

యూత్ పుల్ సినిమాలకు ఎప్పుడూ అటెన్షన్ ఉంటుంది. మిస్టర్ అండ్ మిసెస్ టీజర్‌కి అలాంటి స్పందనే లభిస్తుంది. యూత్‌కి సెల్పీ వీడియోలు తీసుకోవడం, ప్రతి మూమెంట్‌ని కాప్చర్ చేద్దామనుకోవడం ఒక అలవాటుగా మారింది. అలాంటి అలవాటు ఇద్దరి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పింది అనే కథాంశంతో యువ దర్శకుడు అశోక్ రెడ్డి రూపొందిస్తున్న మూవీ మిస్టర్ అండ్ మిసెస్. ఈ మూవీ టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. రీడింగ్ ల్యాంప్ క్రియేషన్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటుంది.

Mr & Misses Teaser

దర్శకుడు అశోక్ రెడ్డి చెప్పిన కథ నచ్చిన కొంత మంది నిర్మాతలుగా మారారు. ఈ క్రౌడ్ ఫండెండ్ మూవీలో యూత్ ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి దగ్గరగా ఉండే ఎమోషన్స్‌ని ఎలివేట్ చేయడం జరిగింది. పెళ్ళి చూపులు వంటి రియలిటీ షోలో విన్నర్‌గా నిలిచిన జ్ఞానేశ్వరి లీడ్ రోల్ పోషిస్తుంది. ఫిబ్రవరి 14న వెలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా మొదటి పాటను విడుదల చేయబోతుంది చిత్ర యూనిట్.

Mr & Misses Teaser

హీరో: శైలేష్ సన్ని,హీరోయిన్: జ్ఞానేశ్వరి, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్: సుధీర్ వర్మ, సినిమాటోగ్రఫీ: సిద్దమ్ మనోహర్, ఎడిటర్: కార్తిక్ కట్స్, లిరిక్స్ : కారిష్ కుమార్, కాస్టూమ్ డిజైనర్: సహార్ష రెడ్డి, పబ్లిసిటీ డిజైనర్ : ఓమ్ కార్ కడియమ్, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె. మీడియా, మోహన్ గ్రాఫిక్స్: దిలిప్ కుమార్, స్టోరీ అండ్ డైరెక్షన్: అశోక్ రెడ్డి.

- Advertisement -