ఐటెమ్ సాంగ్స్ చేయడానికి సిద్దమేః ఆదాశర్మ

391
adah-sharma
- Advertisement -

దర్శకుడు పూరీ జగన్నాథ్, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ ఆదాశర్మ. ఆ తర్వాత అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటిచింది. ఆ తర్వాత ఆమెకు తమిళ్ , హిందీ భాషల్లో అవకాశం రావడంతో తెలుగులో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ఆమె అక్కడ నటించిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించకపోవడంతో అక్కడ కూడా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో మాత్రం ఈఅమ్మడుకి ఛాన్స్‌లు రావడం లేదు. ఈ క్రమంలోనే ఇకనుంచి హీరోయిన్ పాత్రలు చేస్తూనే ఐటమ్‌సాంగ్స్ కూడా చేస్తానంటోంది అదాశర్మ.

తాజాగా ఉన్నసమాచారం ప్రకారం నాని నటిస్తున్న జెర్సీ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. స్పెషల్ సాంగ్ లలో తాను నటించడానికి సిద్దమే అని చెప్పిందట ఆదాశర్మ. మళ్లీరావా ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈచిత్రినికి దర్శకత్వం వహిస్తున్నారు. ఐటెమ్ సాంగ్స్ లలో తెలుగు ప్రేక్షకులను మెప్పించి అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈముద్దగుమ్మ. ఆదాశర్మ తర్వలోనే ఈచిత్ర షూటింగ్ లో పాల్గోననుందనే సమాచారం. ఈమూవీలో నాని క్రికెటర్ పాత్రలో కనిపించననున్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈచిత్రాన్ని ఎప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

- Advertisement -