‘మిస్టర్ మజ్ను’ ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌..

169
Mr. Majnu

అక్కినేని అఖిల్ మూడో సినిమా మిస్టర్ మజ్ను వచ్చే ఏడాది జనవరి 25 రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. ఈ చిత్రంలోని ‘ఏమైనదో…’అంటూ సాగే తొలి లిరికల్‌ పాటను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ఇందులో అఖిల్, నిధి ఒకరినొకరు మిస్సవుతున్నట్లుగా కనిపించారు.

Mr. Majnu

బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ ష్యూటింగ్‌ పూర్తి చేసుకొని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘తొలిప్రేమ’తో సరికొత్త ప్రేమకథని ఆవిష్కరించిన వెంకీ అట్లూరి.. మరో వైవిధ్యభరితమైన లవ్‌స్టోరీ చూపించబోతున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘హలో’ తర్వాత అఖిల్‌ నటిస్తున్న చిత్రమిది. ఆ ప్రేమకథలాగే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి.

Mr. Majnu - Yemainado Lyric Video (Telugu) | Akhil Akkineni | BVSN Prasad | Thaman S, Venky Atluri