అఖిల్‌ ‘మిస్టర్ మజ్ను’ ఫస్ట్‌లుక్‌ టీజర్..

222
Mr. Majnu First Look
- Advertisement -

అక్కినేని అఖిల్‌ తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను’. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా నిర్మితమవుతోంది. అఖిల్‌కు ఇది మూడో చిత్రం. తొలి రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో మూడో సినిమాని ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తున్నాడు అఖిల్. తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వంలో వహిస్తున్నాడు. అయితే అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ సినిమా టీజర్‌ను ఈ రోజే విడుదల చేశారు.

Mr. Majnu First Look

ఈ చిత్రానికి మిస్టర్ మజ్ను అనే టైటిల్ ఫిక్స్ చేశారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని అన్నారు. ఊహించినట్టుగానే చిత్ర బృందం ‘Mr. మజ్ను’ టైటిల్‌ను ఖరారు చేసి ఒకేసారి టీజర్‌తో పాటు ఆడియన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. చిత్రంలో అఖిల్ సరికొత్తగా కనిపిస్తున్నాడు.

Mr. Majnu First Look

థమన్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై చిత్రం నిర్మితమవుతుంది. ఈ సినిమాలో విద్యుల్లేఖారామన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను జనవరి 26న విడుదల కానుందని సమాచారం.

- Advertisement -